ఉగాది అంటే తెలుగువారి పండుగ. ఈ తెలుగు సంవత్సరాదికి షడ్రుచులతో పచ్చడి చేసుకుంటాం. సాయంత్రం పంచాంగ శ్రవణం చేస్తాం. ఆ రోజంతా సందడిగా ఉంటుంది. కానీ విదేశాల్లో మన రతెలుగువారు ఉన్న చోట ఇంత సందడి కనిపించదు. పండుగకు కావాల్సిన సామగ్రిని సమకూర్చుకోవడం కోసం, సెలవు దినం కాకపోయినా పండుగ చేసుకోవాలనే ఆరాటం మాత్రం కొంత కనిపిస్తుంది. ఇక పిల్లల విషయానికి వస్తే మన సంప్రదాయాలు, పండుగల విశిష్టతలు తెలియకుండా పోతున్నాయి. అందుకే ప్రవాసీయులకు ఉగాది విశిష్టత గురించి తెలిపేందుకు సింగపూర్లో నివసించే కొందరు ఒక షార్ట్ ఫిలింను రూపొందించారు. ఉగాది విశిష్టత గురించి తల్లిదండ్రుల ద్వారా పిల్లలు తెలుసుకునే ఇతివృత్తంతో సాగే ఈ లఘు చిత్రం అందరినీ ఆకర్షిస్తోంది. సింగపూర్ తెలుగు టీవీ ద్వారా యూట్యూబ్లో విడుదలైన ఈ షార్ట్ ఫిలిం అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ఈ షార్ట్ ఫిలింలో ఖ్యాతి గణేశ్న, వందన నాదెళ్ల , మౌక్తిక నాగెళ్ల , అక్షర మడిశెట్టి, రత్నకుమార్ కవుటూరు, ప్రత్యూష అవధానుల, దివ్య మరందని, కిరణ్ కుమార్, మూర్తి నాగేళ్ల నటించారు. కళ్యాణ్ ధవల & మాధురి మంతా కథ, సంభాషణలు అందించారు. కళ్యాణ్ ధవల & రాధా కృష్ణ గణేశ్న దర్శకత్వం వహించారు. ఎడిటింగ్ & సాంకేతిక సహకారం :రాధా కృష్ణ గణేశ్న, నిర్వహణ : కాత్యాయనీ గణేశ్న నిర్వర్తించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
“శ్రీ సాంస్కృతిక కళాసారథి” ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
శ్రీరామ నవరాత్రోత్సవాలు ప్రారంభం
రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఉగాది శుభాకాంక్షలు