Sankara Nethralaya | శంకర నేత్రాలయ లాస్ ఏంజెల్స్ చాప్టర్ సక్సెస్
Sankara Nethralaya | శంకర నేత్రాలయ లాస్ ఏంజెల్స్ చాప్టర్ ఆధ్వర్యంలో కాలిఫోర్నియా రాష్ట్రం ప్లాసెంటియా నగరంలోని వాలెన్సియా హైస్కూల్ ఆడిటోరియంలో నిధుల సేకరణ కోసం నిర్వహించిన లైట్ మ్యూజిక్ కచేరీ ఘన విజయం సాధించింది.
Sankara Nethralaya | శంకర నేత్రాలయ లాస్ ఏంజెల్స్ చాప్టర్ ఆధ్వర్యంలో కాలిఫోర్నియా రాష్ట్రం ప్లాసెంటియా నగరంలోని వాలెన్సియా హైస్కూల్ ఆడిటోరియంలో నిధుల సేకరణ కోసం నిర్వహించిన లైట్ మ్యూజిక్ కచేరీ ఘన విజయం సాధించింది. ఈ సంగీత కార్యక్రమంలో ప్రముఖ గాయకులు సుమంగళి, అంజనా సౌమ్య, పార్థు నేమాని, మల్లికార్జున్ మూడు గంటలకు పైగా శ్రోతలను మంత్రముగ్ధులను చేసే మధుర గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.
ఈ కార్యక్రమంలో ప్రైమ్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకులు, చైర్మన్ డా. ప్రేమ్ రెడ్డి ముఖ్య అతిథిగా, లాస్ ఏంజెల్స్‌లో భారత దేశ కాన్సుల్ జనరల్ డా. కె. జె. శ్రీనివాస గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
లక్షలాది మందికి చూపును తిరిగి ప్రసాదించాలనే శంకర నేత్రాలయ మహత్తర లక్ష్యం దాతలు, స్పాన్సర్ల ఉదార సహకారంతోనే సాధ్యమవుతోంది. ఈ సందర్భంగా లాస్ ఏంజెల్స్‌కు చెందిన MESU స్పాన్సర్లు శరత్ కామినేని, శ్యామ్ కూనం, డా. కృష్ణ రెడ్డి, గౌతమ్ నెల్లుట్ల అలాగే దాతలు లక్ష్మీ , త్రినాథ్ గొటేటి, మల్లిక్ కేశవరాజు, డాక్టర్లు మురళి & స్వర్ణ చందూరి, శివనాథ్ పరానండిని డా. ప్రేమ్ రెడ్డి సన్మానించి వారి సేవలను కొనియాడారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి కాన్సుల్ జనరల్ డా. కె. జె. శ్రీనివాస మాట్లాడుతూ.. పుట్టిన దేశం, నివసిస్తున్న దేశం మధ్య సానుకూల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ ప్రవాసుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. డా. ప్రేమ్ రెడ్డి శంకర నేత్రాలయ సేవలను ప్రశంసిస్తూ, మరింత మంది సమాజ సభ్యులు ఈ మహత్తర కార్యంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా పలు కంటి వైద్య శిబిరాల నిర్వహణను స్వయంగా ప్రకటించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ అప్పల్లి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మల్లిక్ బండ, పబ్లిసిటీ చైర్ ప్రసాద్ రాణి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి సిరిగిరి, చాప్టర్ లీడ్స్ ప్రీతి, భాస్కర్, వెంకట్ పోలూ, నాగరాజ ఎమగౌడ, సతీష్ తొట్టెంపూడి, శ్రవణ్ నయ్యాటితో పాటు వాలంటీర్లు శ్రీని సిరిగిరి, శంకర్ చాపా, విష్ణు కల్వకూరు, చంద్ర వెంపాటి, అమర్ బుడగమంట్ల, శారద్ర వాయినేని, మహేశ్ కపడమ్, మోహన్ & అనిత కత్రగడ్డ, అనిత, నవీన్ & అనిత భూమండ్ల, నరేష్ మసారం మరియు సురేష్ బొండా గార్లు విశేష కృషి చేశారు.
ఈ సందర్భంగా శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షులు బాల రెడ్డి ఇందుర్తికి, అలాగే మూర్తి రేకపల్లి, డా. రెడ్డి ఉరిమింది, వంశీ ఎరువరం, రత్నకుమార్ కావుటూరు, శ్రీ గిరి కోటగిరి, గోవర్ధన్ రావు నిడిగంటికి చాప్టర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ కార్యక్రమానికి డా. జీర్డెడ్డి ప్రసాద్, డా. వెంకు రెడ్డి, డా. నంద కుమార్ తిరువైపతి, డాక్టర్లు సావిత్రి & కమలాకర్ రాంభట్ల, డాక్టర్లు గీతా & వెంకట్, డా. రాధా శర్మ, సేరిటోస్ కమిషనర్ అశోక్ పట్నాయక్, AIG హాస్పిటల్స్‌కు చెందిన డా. రాకేశ్ కలపాల వంటి ప్రముఖులు హాజరై వేడుకను మరింత విశిష్టంగా నిలిపారు. అలాగే TASC (తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదర్న్ కేలిఫోర్నియా) అధ్యక్షులు సీతారామ్ పమ్మిరెడ్డి, అధ్యక్షుడు-ఎలెక్ట్ శ్రీ కొండల వాయినేని, మాజీ అధ్యక్షులు అనిల్ అర్రబెల్లి కూడా పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

