Sankara Nethralaya | జార్జియాలోని కమ్మింగ్ పట్టణంలో ఉన్న వెస్ట్ ఫోర్సిత్ హై స్కూల్ వేదికగా శంకర నేత్రాలయ USA (SNUSA) నిర్వహించిన సంవత్సరాంతపు ‘మ్యూజిక్ & డ్యాన్స్ ఫర్ విజన్ – గ్రాండ్ ఫినాలే’ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామీణ భారతదేశంలో నివారించదగిన అంధత్వ నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) విస్తరణకు మద్దతుగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో $1.625 మిలియన్ల నిధులు సమీకరించారు. ఈ నిధులు సుమారు 130 అడాప్ట్-ఎ-విలేజ్ కంటి శిబిరాల నిర్వహణకు ఉపయోగపడనున్నాయి.
సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సామాజిక సేవ, కళ, కరుణల సమ్మేళనంగా నిలిచింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి మాట్లాడుతూ, “MESU ఒక వైద్య కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది ఆశ, సానుభూతి, మానవీయతకు ప్రతీక. ప్రతి గ్రామానికి చేరినప్పుడు అక్కడి వారికి దృష్టితో పాటు కొత్త జీవితాన్ని ఇస్తోంది” అని తెలిపారు.
అట్లాంటాలోని భారత కాన్సుల్ జనరల్ రమేశ్ బాబు లక్ష్మణన్ ముఖ్య అతిథిగా పాల్గొని SNUSA సేవలను ప్రశంసించారు. “నివారించదగిన అంధత్వ నిర్మూలనలో SNUSA అద్భుతమైన సేవలు అందిస్తోంది. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి నాయకత్వం ప్రశంసనీయం” అని చెప్పారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శంకర్ సుబ్రమోనియన్, డా. జగదీష్ శేత్, డా. కిషోర్ చివుకుల, ఉదయ భాస్కర్ గంటి వంటి బ్రాండ్ అంబాసిడర్లు, సలహాదారుల సహకారాన్ని గుర్తించారు. అలాగే రమేశ్ బాబు లక్ష్మణన్ను శంకర నేత్రాలయ USA గౌరవ బోర్డు సలహాదారుడిగా అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ప్రకటించారు.

దాతృత్వం, నాయకత్వంలో విశేష సేవలందించిన ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దృష్టి అంటే భవిష్యత్తును చూడటం మాత్రమే కాదు, దానిని రూపొందించడం కూడా” అని అన్నారు. అలాగే ‘ఘంటసాల ది గ్రేట్’ బయోపిక్ దర్శకుడు సీహెచ్. రామారావును ఘంటసాలకు అందించిన అరుదైన నివాళికి గాను సత్కరించారు. అనంతరం ఈ చిత్రాన్ని అట్లాంటా హిందూ దేవాలయ ఆడిటోరియంలో ప్రదర్శించారు.
టాలీవుడ్ గాయకులు మల్లికార్జున్, పార్థు నేమాని, సుమంగళి గానంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం నటరాజ నాట్యాంజలి కూచిపూడి అకాడమీ, అకాడమీ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్, కర్ణాటిక్ స్ట్రింగ్స్ వయోలిన్ స్టూడియో, భరతకళా నాట్య అకాడమీ, విపంచి మ్యూజిక్ అకాడమీ వంటి సంస్థల కళాకారులు అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా డా. గోవింద విశ్వేశ్వర, డా. వలియా రవి, టి.ఆర్. రెడ్డి, ప్రకాశ్ బేడపూడి, కాష్ బూటాని, అరవింద్ కృష్ణస్వామి, డా. వీణా భట్, జలంధర్ రెడ్డి, రఘు సుంకి, తిరుమల్ రెడ్డి కంభం సహా అనేక మంది దాతలు సహకరించారు.
అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లుగా డా. బి. కృష్ణమోహన్, డా. మాధవ్ దర్భా, డా. అపర్ణ, వెంకట్ చుండి, కళ్యాణి, ప్రసన్న కుమార్, దివంగత డా. ఉమ, ప్రభాకర్ రెడ్డి ఎరగం, నీలం జయంత్, లావణ్య, ఆది మొర్రెడ్డి, రేఖ రెడ్డి, డా. మంజుల మంగిపూడి, డా. రూపేష్ రెడ్డి, మాధవి, వెంకట్ కన్నన్, డా. ప్రసాద్ గరిమెళ్ల, అనిల్ జాగర్లమూడి, ప్యాడీ రావు, రాధ ఆత్మూరి, స్వర్ణిమ్ కాంత్, కోదండ , బిందు, నారాయణ రేకపల్లి, శైలజ, డా. ప్రియా కొర్రపాటి, ప్రతాప్ జక్కా, రాజేష్ తడికమల్ల, డా. సుజాత, సూరి గున్నాల, డా. శేషకుమారి మూర్తి , డా. శ్రీనివాస మూర్తి, శివాని నాగ్పాల్, డా. సందీప్ శాండిల్య, డా. నీతా సుక్తాంకర్, శ్రీ విష్ ఈమని, వర ఆకెళ్ల, కృష్ణ, శుభా, శ్రీని SV, జోనాథన్ షులర్, డా. రఘువీర్ రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, జేసీ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సేకరించిన నిధులను MESUల ద్వారా మారుమూల గ్రామాలకు చేరుకుని ఉచిత కంటి శస్త్రచికిత్సల ద్వారా వేలాది మందికి చూపు అందించనున్నాయి. “ప్రతి స్పాన్సర్ ఒక గ్రామానికి ఆశను తీసుకువస్తున్నారు” అని బాల రెడ్డి ఇందుర్తి అన్నారు.
ఈ విజయానికి కారణమైన మూర్తి రేకపల్లి, శ్రీని రెడ్డి వంగిమల్ల, మెహర్ చంద్ లంక, రాజశేఖర్ రెడ్డి ఐల, డా. మాధురి నంబూరి, ఉపేంద్ర రాచుపల్లి, వెంకీ నీలం, నీలిమ గడ్డమణుగు, రమేష్ చాపరాల, డా. కిషోర్ రెడ్డి రాసమల్లు, గిరి కోటగిరి, వెంకట్ కుట్టువా, శిల్పా ఉప్పులూరి, డా. జనార్దన్ పన్నెల, బిజుదాస్, రామరాజు గాదిరాజు, వసంత చివుకుల, శ్యామ్ అప్పాలి, వంశీ కృష్ణ ఏరువరం, డా. రెడ్డి ఊరిమిండి, రత్నకుమార్ కవుటూరు, గోవర్ధన్ రావు నిడిగంటి తదితరుల సేవలను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు.