హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నామని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, రాజకీయ ఒత్తిళ్లతో నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని సతీష్ కుమార్ అన్నారు. కేసీఆర్ కేవలం ఒక వ్యక్తి కాదు అని తెలంగాణ రాజకీయ ప్రతీక అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేసీఆర్పై నిందలు వేయాలని అడుగడుగునా రాజకీయ కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు.
న్యాయం మీద, న్యాయవ్యవస్థ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. నిజం తప్పకుండా బయటపడుతుంది. ఈ తరహా చర్యల ద్వారా ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించాలన్న ప్రయత్నాలు ఫలించవన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు మేము ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటాం. ఉద్యమ సమయం నుంచి నేటి వరకు కేసీఆర్ వెంట ఎలా ఉన్నామో, భవిష్యత్తులో కూడా వారి వెంటే ఉంటామని అని సతీష్ కుమార్ పేర్కొన్నారు.