సింగపూర్ : విద్యా సంగీతం అకాడమీ (సింగపూర్), ద్వారం లక్ష్మి అకాడమీ అఫ్ మ్యూజిక్ సర్వీసెస్ (తిరుపతి) వారి ఆధ్వర్యంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారి సహకారంతో “స్వరకల్పన సమారాధన” కార్యక్రమ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు యూట్యూబ్ ద్వారా ఘనంగా నిర్వహించారు.
డిసెంబర్ 19, 2021 జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలను, సంగీత గురువులకు అంకితం చేస్తూ వారు రచించి స్వరపరిచిన సంగీతాన్ని ప్రసారం చేసామని నిర్వాహకులు తెలిపారు.
ఎందరో గురువులు, కళాకారులు తెలుగు music enthusiasts తమవంతు కృషిచేస్తూ పాటలు క్రియేట్ చేస్తున్న వారందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి, మన తెలుగుపాట వైవిధ్యాన్ని నిలబెడుతూ, మరిన్ని కొత్త పాటలను వెలుగులోకి తీసుకురావటానికి చేస్తున్న ఒక చిన్ని ప్రయత్నం ఈ స్వరకల్పన సమారాధన.
అన్నమయ్య కీర్తనలు, వర్ణాలు, చక్కటి తిల్లానాతో మరిన్ని శాస్త్రీయ కృతులతో అంతర్జాలంలో ఉన్న తెలుగువారందరినీ రెండున్నర గంటలపాటు ఈ కార్యక్రమం అలరించింది. ఈ వేడుకలలో ప్రఖ్యాతి గాంచిన గురువులు లహరి కొలచెల, డాక్టర్ ద్వారం లక్ష్మి, డాక్టర్ శేషులత విశ్వనాథ్, తాడేపల్లి సుబ్బలక్ష్మి , మోదుమూడి సుధాకర్, ద్వారం VKG త్యాగరాజ్, డాక్టర్ యనమండ్ర శ్రీనివాసశర్మ, లక్ష్మీ సూర్య తేజ, విష్నుభట్ల రామచంద్రమూర్తి, కమలాదీప్తి పాడిన కీర్తనలను ప్రత్యక్షప్రసారం చేశారు.
ఈ రచనలన్నీ కొటేషన్స్ తో సహా ఒక ఈ-పుస్తకరూపంలో కూడా ప్రచురించారు. అంతేకాక గురువులపేరు మీద వారు ఎంపిక చేసిన 11 మంది కళాకారులకు పారితోషకం రూపంలో ఆర్థికసహాయాన్ని కూడా అందచేసామని నిర్వాహకులు కార్యక్రమంలో ప్రకటించారు. సింగపూర్, భారత దేశముల నుండే కాక అమెరికా, UK, మలేషియా నుంచి కూడా వీక్షకులు చూసి ఆనందించటం ఈ కార్యక్రమమునకు మంచి శోభను చేకూర్చింది.
మన సంగీతం మీద, సాంస్కృతిక విలువల మీద ఆసక్తి పెంచడానికి చేస్తున్న ఈ వార్షిక కార్యక్రమానికి, విద్యా సంగీతం అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కాపవరపు విద్యాధరి వ్యాఖ్యానాన్ని అందించి ప్రేక్షకులందరినీ అలరించారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ విచ్చేసి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఈ అంతర్జాల స్వరకల్పన సమారాధన చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన RK వీడియోగ్రఫీ (రాధా కృష్ణ గణేష్ణ, కాత్యాయని)లకు నిర్వాహకుల తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కింది లింక్లో చూడవచ్చని నిర్వాహకులు తెలిపారు.
Program Links: https://youtu.be/z5MTSnF8i6s
https://youtu.be/FySqV3Onx3w