సింగపూర్, జూన్ 9 : రాబోయే రోజుల్లో తెలంగాణ అవిర్భావ దినోత్సవం, వివిధ కార్యక్రమాలను సింగపూర్లో(Singapore) నిర్వహించేందుకు బీఆర్ఎస్(BRS) అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. మహేష్ బిగాల సింగపూర్ పర్యటనలో భాగంగా తెలంగాణ ఎన్నారైలు ఆయనను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐల మద్దతుతో విజయవంతమైందన్నారు.
ఈ తరహా కార్యక్రమాలు ఇతర దేశాల్లోనూ కొనసాగించేందుకు ఎన్ఆర్ఐ విభాగం శక్తివంతంగా ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రంజిత్ , రజినీకాంత్, శ్రీనివాస్, జితేందర్, పెడ్డి చంద్రశేఖర్, బోయిని సమ్మయ్య, అలెక్స్, రవీంద్ర, మణికంఠ, అవుల శివ, బాలకృష్ణ, లక్షపతి, శ్రీధర్, వినోద్, సందీప్, గంగా సాగర్, తదితరులు పాల్గొన్నారు.