BRS Party | హైదరాబాద్ : ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం అధ్యక్షుడు నవీన్‌రెడ్డి అన్నారు. లండన్‌లో శుక్రవారం నిర్వహించిన దీక్షా దివస్‌లో ఆయన మాట్లాడారు. అహింసా పద్ధతిలో రాష్ర్టాన్ని సాధించి కేసీఆర్ తెలంగాణ గాంధీగా ప్రఖ్యాతికెక్కారని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశేష కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నారై బీఆర్ఎస్ విభాగానికి యూకే ప్రవాసులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు హరిగౌడ్, సతీష్‌రెడ్డి, సత్యమూర్తి, రవి, వైస్‌చైర్మన్ గణేష్, వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, సురేష్, జాఫర్, రవి ప్రదీప్, సురేష్, రమేష్, శ్రీధర్‌రావు, నవీన్, ప్రశాంత్‌రావు, రామకృష్ణ, అంజన్‌రావు, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.