తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్ముతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎన్నారై బీఆర్ఎస్ యూకే శాఖ అధ్యక్షులు నవీన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడితే బీజేపీపై తెలంగాణ సమాజం తిరగబడుతుందని అన్నారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చినా.. తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గు చేటు అని విమర్శించారు. రానున్న రోజుల్లో మీ రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్య పార్లమెంట్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.