BRS Sabha | మే 6న వరంగల్లో రైతు సభను విజయవంతం చేయాలి : బీఆర్ఎస్ బహ్రెయిన్ నాయకులు
BRS Sabha | ఈనెల 6న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ బహ్రెయిన్ నాయకులు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.
వరంగల్ : ఈనెల 6న బీఆర్ఎస్ ( BRS ) ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ బహ్రెయిన్ (BRS Bahrain) నాయకులు రాధారపు సతీష్ కుమార్ ( Satish Kumar ) పిలుపునిచ్చారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం , రెండున్నరేండ్లు గడిచినా ఏ ఒక్క హామీలను నెరవేర్చలేకపోయిందని
ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎరువులు, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోలులో తీవ్ర సంక్షోభం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పండించిన గింజను కొనుగోలు చేయడంతో పాటు రైతు బంధు ఇచ్చి రైతన్న కుటుంబంలో సంతోషాన్ని నింపారని వెల్లడించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

