BRS Australia | ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి
BRS Australia | బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో చేపట్టనున్న డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
మెల్బోర్న్: బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ( BRS Australia ) ఆధ్వర్యంలో చేపట్టనున్న డిజిటల్ సభ్యత్వ నమోదు ( Digital Membership ) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి( Kasarla Nagendhar Reddy ) పిలుపునిచ్చారు. ఈ మేరకు మెల్బోర్న్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సిడ్నీ , కాన్బెర్రాలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశాలకు విశేష స్పందన వచ్చిందని తెలిపారు.

బీఆర్ఎస్ నాయకుడు సాయిరామ్ ఉప్పు మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ఆస్ట్రేలియా పర్యటనకు ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఈ పర్యటన చారిత్రాత్మకంగా నిలిచేలా ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. కొత్త కమిటీల ఏర్పాటు విషయంపై సమావేశంలో చర్చించారు. వినయ్ సన్నీ చెలుపాటి మాట్లాడుతూ బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి చురుకుగా పనిచేయాలని ఆహ్వానించారు.
ఈ సమావేశంలో ముఖ్య నాయకులు ఉదయ్ సింహారెడ్డి, విశ్వామిత్ర మంత్రిప్రగడ, సూర్యరావు, సతీష్ పులిపాక, రాకేష్, నితీష్ గౌడ్ , సాయిపృథ్వి , వినోద్ కత్తుల, సునీల్ యాదవ్, రాకేష్ యాదవ్, భాను తేజ్, అజయ్, వివాన్, సంజు రెడ్డి, సుమంత్ , ఉదయ్ రెడ్డి, వెంకట్ రమణ , రామ్ సాయి, సుమంత్, సాయి కృష్ణ, సాయి వంశీ, సాయి కిరణ్,అశ్రీత్, నరేందర్ రెడ్డి, శివ హైదరాబాద్ , తిరుపతి పెద్ది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

