హైదరాబాద్ : ఉగాది వేడుకలను అంతర్జాలం వేదికగా హాంకాంగ్ తెలుగు వారు ఘనంగా జరుపుకున్నారు. తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కనువిందుగా ఈ వేడుకలను అంతర్జాల మాధ్యమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హాంకాంగ్ తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి జయ పీసపాటి ప్రారంభించగా.. శాంతి మోగంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉగాది వేడుకలను ఆర్థిక కార్యదర్శి రాజశేఖర్ మన్నే, ట్రెజరర్ నర్రా వరప్రసాద్, జనరల్ సెక్రటరీ గరదాస్ జ్ఞానేశ్వర్, ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో నిర్వహించారు.