Bathukamma Celebrations | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఖండాంతరాల్లో కూడా మహిళలు కుటుంబసమేతంగా పెద్ద సంఖ్యలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. యూకేలోని లూటన్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు లూటన్ తెలుగు అసోసియేషన్ (ఎల్టీఏ) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకున్నారు.
మహిళలు, చిన్నారులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అని పాడుకుంటూ ఆటపాటలతో సందడి చేశారు. చిన్నారులు సంప్రదాయ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మహిళలంతా తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. ఈ సందర్భంగా బతుకమ్మలను పేర్చిన వారందరికీ బహుమతులను అందజేశారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు.
Vidadala Rajini | వైసీపీకి షాక్.. విడదల రజినీపై డిజిటల్ బుక్లో ఫిర్యాదు!
Modi-Meloni | మెలోనీ ఆత్మకథకు ప్రధాని మోదీ ముందుమాట.. మరోసారి తెరపైకి ‘మెలోడీ’ మూమెంట్
Road Accident | ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ముగ్గురు మృతి