BRS Bahrain | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న అమరణ నిరాహార దీక్ష చేపట్టి 15 ఏండ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమం బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ , ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన మర్చిపోలేని రోజు అని పేర్కొన్నారు. స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు, తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం అని వ్యాఖ్యానించారు. నాలుగు కోట్ల తెంగాణ ప్రజలు ముక్త కంఠంతో మా తెలంగాణ మాకు కావాలని నినదించారన్నారు.
`కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థను కదిలించిన సందర్భం దీక్షా దివస్. అందర్నీ మెప్పించి ఒప్పించి, దేశ రాజకీయ వ్యవస్థను, రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థను కులమతాలకు అతీతంగా అందరిని కలిపిన సందర్భమే దీక్షా దివస్. నాటికి, నేటికీ ఏం మారింది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను మేలిమి బంగారంగా మార్చుకున్నాం. అభివృద్ధి చేసుకున్నాం. కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలు సంక్షేమ ఫలాలు అనుభవించాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అమలైన హామీలు ప్రతి ఇంటికీ చేరినయి.ప్రజల మదిలో చెరగని ముద్ర వేసి, చరిత్ర మరవని నిజమైన ‘ప్రజా పాలన’కు నిదర్శనంగా నిలిచినయి` అని సతీష్ కుమార్, వెంకటేశ్ బొలిశెట్టి పేర్కొన్నారు.
`తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లలో ఘనంగా అభివృద్ధి చెంది, పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఏ విధంగా వందేండ్ల విధ్వంసానికి గురైంది. అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి, ప్రజా పాలనా అని ఆరు గ్యారెంటీలు అని తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేశారు. జేబునిండా డబ్బులతో దర్జాగా బతికిన రైతన్నను కాంగ్రెస్ సర్కారు బేడీలు వేసి ఠాణాల చుట్టూ తిప్పుతున్నది. . రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంటు, సాగునీరు, పంటల కొనుగోళ్లు చేపట్టి రైతన్నకు కేసీఆర్ సర్కారు వెన్నెముకగా నిలిస్తే, రేవంత్ పాలనలో రైతన్న ఆగమవుతున్నది.మీ ఏడాది పాలనలో తెలంగాణలో ఎక్కడ చుసిన అర్తనాదాలు తప్ప సంతోషాలు లేకుండా చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు మీకు నమ్మి అధికారం ఇస్తే మీరు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయమని , మీ మోసాలను, అన్యాయాలను, అవినీతిని ప్రశ్నిస్తే హామీలపై చేతులెత్తేసి పరిపాలన చేతగాక మీ ప్రజాపాలనలో నాయకులపై కేసులు పెడుతూ, జర్నలిస్టులపై దాడులు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, పాలనలోని లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సోషల్ మీడియా వారియర్లను బేరిస్తూ, అరెస్టులు చేస్తున్నారు. హామీలను మరిచిన సీఎం రేవంత్రెడ్డి విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు` అని సతీష్ కుమార్, వెంకటేశ్ బొలిశెట్టి వ్యాఖ్యానించారు.
`ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఆరు గ్యారంటీలను అమలు చేసేదాకా ప్రజల పక్షాన పోరాడుతాం , ప్రశ్నిస్తాం. కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అని, ఉద్యమ నేతను ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తప్ప అంతకంటే చేసింది ఏమిలేదు. ఇప్పుడు కొడంగల్లోనే ప్రజలు తిరగబడ్డారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా తిరగబడరారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం ఎవరి తరం కాదు తెలంగాణ ఉన్నంత కలం ప్రజల గుండెల్లో కలకలం పదిలంగా వుంటారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్ను ప్రజలు ఎప్పటికి మరువలేరు. ప్రజలు మీ ఏడాది పాలనలో ఎం కోల్పోయారో చాల తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో మీకు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా వున్నారు. తెలంగాణకు అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష` అని సతీష్ కుమార్, వెంకటేశ్ బొలిశెట్టి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్ , కార్యదర్శులు, చెన్నమనేని రాజేందర్, సంగేపోలు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్, చిలుకూరి రాజలింగం , వెంకటేష్, సాగర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.