NRI News | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను దక్షిణాఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. జొహన్నెస్‌బర్గ్‌లో బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షులు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు, కమ్యూనిటీ సభ్యులు పాల్గొని కేక్ కట్ చేశారు. సాయి కిరణ్ నల్ల, అరవింద్ చికోటి, వెంకట్ రావు తాళ్లపల్లి , రాంబాబు తోడుపు నూరి, నమా రాజేశ్, సాయి కిరణ్ వేముల, రవీందర్ నల్లబాపని మిగితా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఆస్ట్రేలియాలో వృక్షార్చన..
తెలంగాణ ఉద్యమ రథసారధి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. వృక్షార్చనతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా (BRS Australia) అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిడ్నీ, మెల్బోర్న్ , అడిలైడ్, బ్రిస్బేన్ నగరాల్లో కేసీఆర్ దీర్గాయుష్యు కోసం ప్రత్యేక పూజలు, అన్న దాన కార్యక్రమాలు చేశారు. వృక్షార్చనతో అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో రాజేశ్ రాపోలు మాట్లాడుతూ.. అరవై ఏండ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన కేసీఆర్ దీర్గాయుష్యుతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు. రవీందర్, సుజాత దంపతుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సభ్యులు వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రమౌళి, అరుణ్ మస్నా, యాదమ్మ, నవ్య, విద్య, సంగీత దుపాటి, రబియా బేగం, మధు రావు, అజాజ్ మొహమ్మద్, ఇమాముద్దీన్, సృజన్ వంకాయల, మాధవ్ గుడుకుంట్ల, అవినాష్ అడ్లూరి తదితరులు పాల్గొన్నారు.