లండన్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన(KCR birthday) వేడుకలను ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్(London)లో ఘనంగా ఘనంగా నిర్వహించారు. ఎన్నారై(NRI) బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన కేక్ కట్ చేశారు. ఉద్యమ సమయం నుంచి నేటి వరకు కేసీఆర్ వెంట ఎలా ఉన్నామో, భవిష్యత్తులో కూడా వారి వెంటే ఉంటామని అశోక్ గౌడ్ తెలిపారు.
అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిక్కా చంద్రశేఖర్, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, హరి గౌడ్ నవాబుపేట్, సత్యమూర్తి చిలుముల, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, మల్లా రెడ్డి, వీర ప్రవీణ్ కుమార్, రమేష్ ఎసెంపెల్లి, రవి రేతినేని, పృథ్వీ రావుల, జస్వంత్, శుష్మున రెడ్డి, క్రాంతి, పావ, తదితరులు పాల్గొన్నారు.