కువైట్ : కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో రక్తదానం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరు కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలిగి మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవ చేయాలని, తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు కేసీఆర్ అందించిన నాయకత్వం చారిత్రాత్మకమని కొనియాడారు. త్వరలోనే మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ను చూడాలని, రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నామని అధ్యక్షురాలు అభిలాష తెలిపారు.
కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలు 72 దేశాలలో నిర్వహించాలనే ఆలోచనతో హిమాన్షు ముందుకు రావడం ఎంతో సంతోషకరమని అన్నారు. మహేష్ బిగాల సూచనల మేరకు ప్రతి సంవత్సరం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఎలా నిర్వహిస్తున్నామో, అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించామని అధ్యక్షురాలు అభిలాష వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అభిలాష గొడిశాల, సురేష్ గౌడ్, ప్రమోద్, అయ్యప్ప, జగదీశ్, వసంత్, నరేందర్, జమీల్, రవి, నౌషి, రామ్చరణ్, హిమాన్ష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.