నగోయా: జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో.. భారత్‌కు గోల్ప్‌లో గోల్డ్ మెడల్ దక్కింది. భారత మహిళా ప్లేయర్ ప్రణవి ఉర్స్(Pranavi Urs).. వ్యక్తిగత స్ట్రోక్ ప్లే గోల్ఫ్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నది. ఫైనల్ రౌండ్లో ఓ స్ట్రోక్ లీడ్‌తో ఆమె ఆ మెడల్‌ను కైవసం చేసుకున్నది. అయితే గోల్ఫ్‌లో ఇండియన్ టీమ్‌కు సిల్వర్ కూడా దక్కింది. మైసూరుకు చెందిన 23 ఏళ్ల ప్లేయర్ ప్రణవి.. చివరి క్షణాల్లో అద్భుతంగా ఆడింది. చైనా ప్లేయర్ యిన్ రౌనింగ్, సింగపూర్ ప్లేయర్ షానన్ టాన్ నుంచి గట్టి పోటీ ఉన్నా.. ప్రణవి మాత్రం వత్తిడిని జయించింది.
మరో రెండు హోల్స్ మిగిలి ఉన్న సమయంలో 15 పాయింట్లు వెనకబడ్డ ప్రణవి.. కీలకమైన స్ట్రోక్‌తో కాంటెస్ట్‌ను థ్రిల్లింగ్‌గా మార్చింది. ఇక టీమ్ ఈవెంట్లో భారత్ సిల్వర్ గెలవడంలోనూ ప్రణవి కీలక పాత్ర పోషించింది. టీమ్ ఈవెంట్లో అదితి అశోక్, దీక్షా డాగర్ ఉన్నారు. గతంలో వ్యక్తిగత గోల్ప్ ఈవెంట్లో 2002లో మెన్స్ కేటగిరీలో శివ్ కపూర్ స్వర్ణం గెలిచాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రణవి.. గోల్ఫ్‌లో గోల్డ్ కొట్టింది.
ప్రస్తుతం మెడల్స్ జాబితాలో ఇండియా అయిదో స్థానంలో ఉన్నది. ఇండియా ఇప్పటి వరకు మొత్తం 79 పతకాలను సాధించింది. దీంట్లో 18 స్వర్ణం, 26 రజతం, 35 కాంస్య పతకాలు ఉన్నాయి.
INDIA HAD WAITED FOR THIS GOLD IN WOMEN’S GOLF. 🇮🇳🥇⛳
And now, for the FIRST TIME EVER, an Indian woman has won the Asian Games individual golf gold.
PRANAVI URS.
Three years after Aditi Ashok came agonisingly close in Hangzhou, Pranavi Urs has gone all the way in Nagoya.… pic.twitter.com/QzZxqaiWbq
— Anil Bansal (@dilseanilbansal) October 3, 2026