Kalatapasvi K Viswanath | కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్, జయలక్ష్మి దంపతుల సంస్మరణ సభ శుక్రవారం సాయంత్రం శ్రీనగర్ కాలనీ శ్రీ సత్యసాయి నిగమాగమమ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. వారి కుమారులు, కుమార్తె, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సభలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు “సంగీతం – విశ్వనాథ్ గారు” అనే అంశంపై ప్రధాన ప్రసంగం చేశారు. మానవులతో పాటు పశుపక్ష్యాదుల జీవితాలపై కూడా సంగీతం చూపే ప్రభావాన్ని సోదాహరణలతో వివరిస్తూ, విశ్వనాథ్ సంగీత-నృత్యకళల పట్ల చూపిన ఆసక్తి, వాటిని సినిమా మాధ్యమం ద్వారా పండిత పామరులకు అందించిన విధానాన్ని విశదీకరించారు. దాదాపు గంటపాటు సాగిన ఆయన ప్రసంగం శ్రోతలను తన్మయులను చేసింది. విశాలమైన సత్యసాయి ఆడిటోరియం విశ్వనాథ్ అభిమానులతో నిండిపోయింది.
K
సభలో విఎల్ సుబ్రహ్మణ్యం, జేడీ లక్ష్మీనారాయణ, తనికెళ్ల భరణి, పార్ధసారథి తదితరులు పాల్గొని విశ్వనాధ్ దంపతుల జ్ఞాపకార్థం తమ గౌరవాన్ని చాటారు.
విశ్వనాథ్ సినిమాల్లో ఉపయోగించిన పాటలతో పాటు వేటూరి వంటి గేయరచయితల ప్రతిభను తెరపై చూపుతూ, దర్శకుని లోకాన్ని కొత్త కోణంలో పరిచయం చేశారు చాగంటి కోటేశ్వరరావు. ఎన్నోసార్లు విన్న పాటలకే ఆయన విశ్లేషణలు కొత్త కోణాలను ఆవిష్కరించాయి.. ఈ సందర్భంగా సభకు హాజరైన అభిమానులు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. మన కాలంలో విశ్వనాథ్ ఉన్నందుకు, వారి ఉన్నత సంస్కారంతో రూపొందిన సినిమాలను చూసే భాగ్యం కలిగినందుకు తెలుగు ప్రజలు గర్వపడతారని సభలోని పలువురు పేర్కొన్నారు.
K Viswanath4