తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు గులాబీ జెండా పట్టుకుని కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ, ప్రజలకు సేవలందిస్తున్న ఎన్నారైల పాత్ర మరువలేనిది అని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ కొనియాడారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎన్నారైల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తనకు స్ఫూర్తిని ఇచ్చిన కేసీఆర్, గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను బతికి ఉన్నంత వరకు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాబోయే తరాల కోసం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని సంతోష్ కుమార్ అన్నారు. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ఎన్నారై బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నేటివరకు తమను ఎంతో ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న సంతోష్ కుమార్‌కు ఎన్నారైల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు పొందడం తమకు గర్వంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని అవార్డులు, ప్రశంసలు పొందాలని ఆకాంక్షించారు. ఎన్నారైలంతా ఎప్పటికీ కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో, ప్రత్యక్ష నిరసన కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు.

Santosh Kumar1
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే 16 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలను సభకు వివరించారు.కేసీఆర్ సంక్షేమ పాలన నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ రాక్షస పాలన లో పడ్డామని కాబట్టి మళ్ళీ మరో ఉద్యమం చేసి తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలన్నారు. కేసీఆర్ పాలనలో రామరాజ్యం తెచ్చుకోవాలని దానికోసం మనమంతా కష్టపడి పనిచేయాలని ఎన్నారైలకు పిలుపునిచ్చారు. సంతోష్ ఆధారణ అభిమానం సమన్వయం ఇలాగే ఉండాలని రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని, సమయమిచ్చి హాజరైనందున కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవ, ఎన్నారై బీఆర్ఎస్ యూకే మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి , టాక్ మాజీ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి, ఇగ్నీట్ మైండ్స్ సంస్థ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి, సిక్కా చంద్రశేఖర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ, టాక్ సీనియర్ నాయకులు హరి గౌడ్, రవి రేతినేని, రవి పులుసు, సత్య చిలుముల, రమేష్ ఎసెంపెల్లి, గణేష్ కుప్పాల, అబూజర్, సురేష్ బుడగం, శ్రీకాంత్ జెల్లా, మట్టా రెడ్డి,సత్యపాల్ రెడ్డి, సురేష్ గోపతి, ప్రశాంత్ మామిడాల, క్రాంతి, స్వాతి, జాహ్నవి, దివ్య, తరుణ్, అమరేశ్వరి తదితరులు పాల్గొన్నారు.