సౌత్ ఆఫ్రికా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో జోహన్నెస్‌బర్గ్ మిడ్రాండ్లో ఘనంగా నిర్వహించారు. సభ్యులు కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సౌత్ ఆఫ్రికా లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జై విష్ణు గుండా అధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో కేటీర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జై గుండా విష్ణు మాట్లాడుతూ.. స్కూల్లో పిల్లలు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా అందించిన స్కూల్ కిట్స్ తీసుకొని సంతోషంగా కేటీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపారు అని అన్నారు .ఈకార్యక్రమం విజయవంతంగా జరగటానికి సహకరించిన నరేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే తెలంగాణ భవన్లో జై గుండా విష్ణు, నరేష్ యాదారి కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ కేటీఆర్ రాజకీయ నాయకుడిగానే కాకుండా ప్రజల సమస్యలపై స్పందించే సేవామూర్తిగా నిలిచారు అని ప్రశంసించారు. 2020లో కొవిడ్ సమయంలో 108 అంబులెన్స్‌లు అందించగా, 2021లో దివ్యాంగులకు 1400కిపైగా కస్టమ్ ట్రైవీలర్లు అందజేశారని గుర్తుచేశారు. అలాగే 2022లో విద్యార్థుల శిక్షణాభివృద్ధికి 6000 సామ్సంగ్ ట్యాబ్‌లు పంపిణీ చేసి NEET/JEE కోచింగ్‌కు తోడ్పడ్డారు. 2023లో హైదరాబాద్ యూసుఫ్‌గూడ స్టేట్ హోమ్‌లో 116 మందికి ల్యాప్‌టాప్‌లు అందించి పూర్తి కోచింగ్ సపోర్ట్ ఇచ్చారు. 2024లో నేతన్నల ఆత్మహత్యలపై స్పందించి, బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.
అలాగే BRS NRI South Africa శాఖ ప్రారంభమైన 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. గత ఏడు ఏళ్లుగా కమిటీ సభ్యులు, స్థానిక కమ్యూనిటీ సైతం అందించిన అచలమైన మద్దతుకు నాగరాజు, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు అలాగే అన్ని రకాలుగా సహకరిస్తున్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాలకు ధన్యవాదాలు తెలిపారు.
సౌత్ ఆఫ్రికాలో బీఆర్ఎస్ కోర్ కమిటీ సభ్యులు మేడసాని నరేందర్ రెడ్డి, హరీష్ రంగా, సాయి కిరణ్ నల్ల, కిరణ్ కుమార్ బెల్లి, రాంబాబు తోడుపునురి, అరవింద్ చికోటి, శివా రెడ్డి, విజయ్ జుంజూర్, సౌజన్ రావు, నామా రాజేశ్వర్, నవదీప్ రెడ్డి పాల్గొన్నారు.