హైదరాబాద్ : మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ ( Joginapally Santosh Kumar) కు లండన్ ( London ) లో ఘన స్వాగతం లభించింది. ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని అందుకోవడానికి లండన్ వచ్చిన సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు నవీన్ రెడ్డి( President Naveen Reddy ) ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ శాఖ వ్యవస్థాపకులు అనీల్ కూర్మాచలం, గ్రీన్ ఇండియా కో ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాబుపేట్, సత్య మూర్తి చిలుముల, మాజీ అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో ఐటీ, మీడియా, పీఆర్ కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు, యూత్ వింగ్ సెక్రటరీలు పవన్ కుమార్ గౌడ్, తరుణ్ లునావత్, యూత్ వింగ్ కో ఆర్డినేటర్ అమరేశ్వరి బోయిని, మీడియా కో ఆర్డినేటర్ సాయి కిరణ్ రావు పేరాల, లెస్టర్ ఇన్చార్జి సాకేత్ కాచవరపు , టాక్ జనరల్ సెక్రటరీ సుప్రజ పులుసు , ముఖ్య సభ్యులు సుమంత్, సంకీర్త్ రెడ్డి, శివ చరణ్ పాల్గొన్నారు.