Ganesh Immersion | హైదరాబాద్, నమస్తే తెలంగాణ : సిడ్నీ(ఆస్ట్రేలియా)లో గణేశ్ వేడుకలు ఘనంగా జరిగాయి. మిత్రుల వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రులైన ఆఖరి రోజైన శనివారం జరిగిన లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన వేలంలో ఓజీ 11 టీమ్ రికార్డు స్థాయిలో 13.44 లక్షల రూపాయలకు లడ్డూను కైవసం చేసుకుంది. సమితి సభ్యుల ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జన వేడుకలు ముగిశాయి.