హైదరాబాద్ : అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక Blue Valley North High School లో ఇటీవలదీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది తెలుగు వారు పాల్గొన్నారు. కూచిపూడి, భరత నాట్యం, జానపద, శాస్త్రీయ నృత్యాలు అందరిని అలరించాయి. ఈ వేడుకలో TAGKC కి సేవలు అందించిన మంజుల సువ్వారి, సుచరిత వాసంను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అలాగే పలు అంశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి కార్తిక్ వాకాయల, శ్రీలేఖ కొండపర్తి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. TAGKC ఉపాధ్యక్షుడు చంద్ర యక్కలీ, తదితరులు పాల్గొన్నారు.
నిర్వాహక బృందం..
నృత్య ప్రదర్శన చేస్తున్న చిన్నారులు