Mahesh Bigala : ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor Policy) పేరుతో తమ పార్టీ ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) ఈడీ అక్రమంగా కేసు బనాయించి 165 రోజులు అన్యాయంగా జైల్లో వేయించడం తీవ్ర బాధాకరమని ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ పాలసీలో ఆమెకు ఎలాంటి ప్రమేయం లేదని, ఇందుకు సంబంధించి ఆమె వద్ద నుంచి ఎలాంటి పత్రాలు, ఆధారాలు లభించలేదని ఆయన చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అసలు దమ్ము లేదని, అన్యాయంగా, అక్రమంగా బనాయించారని మహేశ్ బిగాల ఆరోపించారు. రాజకీయ ప్రేరేపిత కేసులో చివరకు న్యాయమే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 15న అరెస్టయిన కవిత.. మంగళవారం బెయిల్పై విడుదలయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఆమె హైదరాబాద్కు చేరుకోనున్నారు.