ఫిన్లాండ్లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు
Bathukamma | ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఫిన్లాండ్లో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్టోబర్ 2న జరిగిన ఈ వేడుకలకు ఫిన్లాండ్లోని అన్ని ప్రాంతాల నుంచి 400 మంది హాజరయ్యారు. చిన్నారులు, మహిళలు
Bathukamma | ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఫిన్లాండ్లో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్టోబర్ 2న జరిగిన ఈ వేడుకలకు ఫిన్లాండ్లోని అన్ని ప్రాంతాల నుంచి 400 మంది హాజరయ్యారు. చిన్నారులు, మహిళలు ఆటపాటలతో అలరించారు. ఈ వేడుకలకు తెలుగువారితో పాటు ఫిన్లాండ్ స్థానికులు కూడా హాజరయ్యారు.

గతంలో నిర్వహించిన కార్యక్రమాలకు 300 మంది హాజరయ్యేవారని, కానీ ఈ సారి నాలుగు వందల మందికి పైగా హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. తెలుగు వారు ఫిన్లాండ్కు అధికంగా వస్తున్నారనడానికి ఈ సంఖ్య నిదర్శనమని ఫిన్లాండ్ తెలుగు సంఘం సంస్థ కార్యవర్గం రఘునాథ్ పార్లపల్లి, సుబ్రమణ్య మూర్తి, జ్యోతి స్వరూప్ అనుమాలశెట్టి, సత్యనారాయణ కంచర్ల తెలిపారు.

ఇంత మందితో కలిసి పండుగ చేసుకోవడంతో.. మన ఊరిలో, మన ఇంటిలో ఉన్నట్లే అనిపించిందన్నారు. రాబోయే రోజుల్లో వెయ్యి మంది పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీవల్లి అడబాల, రోజా రమణి మొలుపోజు, వినయ్ శింగపురం, స్పందన ఈచూరి, శ్రుతి కొత్రిక్, వాసు దాసరి, వెంకట్ వారణాసి చెప్పారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

