BRS Silver Jubilee | అమెరికాలోని డాలస్లో జూన్ 1వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవాలకు రాయలసీమ సంస్థలు మద్దతు తెలిపాయి. కేటీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్న ఈ సభకు తమ మద్దతు ఉంటుందని డాలస్ రాయలసీమ ఆర్గనైజేషన్ తెలిపింది. ఈ మేరకు ఈ సంస్థ నుంచి దాదాపు 200 మంది హాజరై తమ సంఘీభావం తెలిపారు. వీరిలో డాక్టర్ దర్గా నాగిరెడ్డి, చందూ చింతల, కృష్ణారెడ్డి కోడూరు, శివ అన్నపురెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, ఎలాంటి ప్రాంతీయ బేధాలు చూపకుండా రాయలసీమ సంస్థ మద్దతు తెలపడం పట్ల బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ధన్యవాదాలు తెలిపారు. వివిధ సంఘాలతో కలిసి మాట్లాడుతున్నప్పుడు అందరూ సభ గురించి ఎదురు చూస్తున్నట్లు చెప్పారని అన్నారు
ఈ సందర్భంగా యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్ మాట్లాడుతూ.. ఎక్కడ చూసినా అందరి నుంచి మద్దతు వస్తుందని తెలిపారు. డాలస్లో కూడా రాయలసీమ నుంచి ముందుకొచ్చి తమకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. అన్ని సంస్థల నుంచి, అందర్నీ కలుపుకుని రజతోత్సవ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని తెలిపారు. సన్నాహక సభలో రావు కాల్వల మాట్లాడుతూ.. 2015 లో కేటీఆర్ USA వచ్చినప్పుడు ఏమి చెప్పారో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాలుగా తెలంగాణను అభివృద్ధి చేయించారని అన్నారు. Tpad అనేది పెద్ద సంస్థ అని.. తాము ఈ సభకు మద్దతు పలుకుతూ పెద్ద ఎత్తున హాజరవుతామని తెలిపారు. హేమంత్ బెజ్జంకి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యారంగంలో ఎంతో ముందుకెళ్లిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసిందని తెలిపారు. ఈ సన్నాహక సభలో సురభి శ్రీనివాస్ , అభిలాశ్ రంగినేని , దిలీప్ కొణతం, అన్వేష్ రెడ్డి , కిరణ్ మిర్యాల, సామ్, రుషికేశ్ రెడ్డి , మనోజ్ ఏనుగంటి, సత్యం యాదగిరి వివిధ నాయకులు పాల్గొన్నారు.
Brs Nria2
రాబోయే రోజుల్లో బే ఏరియా, హ్యూస్టన్లో రజతోత్సవ సన్నాహక సభలు నిర్వహించనున్నారు. ఈ సన్నాహక సభల్లో బాల్క సుమన్, గాదరి కిశోర్, గ్యాదరి బాలమల్లు, క్రాంతి కిరణ్ చంటి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చల్ల ధర్మా రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి , పెద్ది రెడ్డి, నోముల భగత్ తదితరులు పాల్గొననున్నారు.