ఆస్ట్రేలియా : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రచంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు..మూడు రోజుల పాటు కేసీఆర్ బర్త్డే వేడుకలు నిర్వహిస్తున్నారు.
అందులో రెండో రోజు ఆస్ట్రేలియాలో కేసీఆర్ జన్మదిన వేడుకలను సిడ్నీ, అడిలైడ్ , మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్ ,గోల్డ్ కోస్ట్ , బెండీగో, బల్లారాట్ నగరాలలో TRS ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు.
సభ్యులందరు ఒక్కొక్క మొక్క నాటి హరిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు . వినయ్ సన్నీ గౌడ్ ఆధ్వర్యంలో మెల్బోర్న్ లో కెసిఆర్ దీర్గాయుష్యు కై ప్రత్యేక పూజలు, అన్న దాన కార్యక్రమాలు చేసి అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు కోలాహలంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపి ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడ్డ నేత కేసీఆర్ అన్నారు. చావు అంచులకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అన్ని రంగాలలో రాష్ట్రాన్ని నేడు ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు.
సీఎం కేసీఆర్ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాజేష్ రాపోలు , ప్రవీణ్ రెడ్డి, రవి యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సాయిరాం ఉప్పు, వినయ్ సన్నీ గౌడ్, సంతోష్, వినోద్, చైతన్య, జోన, అనూప్ తదితరులు పాల్గొన్నారు.