బీఆర్ఎస్ శాఖ సౌత్ ఆఫ్రికా (BRS South Africa) ప్రెసిడెంట్ గుర్రాల నాగరాజు ( Gurrala Nagaraju ) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ( Silver Jubilee Celebrations ) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ ఆఫ్రికాలోని జొహెన్స్ బర్గ్ సర్వీసెస్ మిడ్రాండ్ పోలీస్స్టేషన్లో పేదలకు వింటర్ బ్లాంకేట్లను ( Winter Blankets) పంపిణీ చేశారు.
రజతోత్సవ వేడుకల సందర్భంగా సౌత్ ఆఫ్రికాకు చెందిన మిస్ వరల్డ్ ( Miss World ) జోలిజ్ జాన్సెన్ వాన్ రెన్స్బర్గ్ ( Jolies Jansen van Rensburg) తో బ్లాంకేట్లను పంపిణీ చేసినట్లు నాగరాజు వెల్లడించారు. బీఆర్ఎస్(BRS) పార్టీ తరపున ప్రతి చలికాలములో సౌత్ ఆఫ్రికా లోని వివిధ ప్రాంతాలలో ప్రతి సంవత్సరం దుప్పట్ల పంపిణీ జరుగుతుందని వివరించారు. సౌత్ ఆఫ్రికా పోలీస్ సభ్యులు మాట్లాడుతూ బీఆర్ఎస్ శాఖ సభ్యులు పేదలకు సేవాల కార్యక్రమాలు అందించడం అభినందనీయమని అన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి మేడసాని , హరీష్ రంగ, అరవింద్ చీకోటి, జ్యోతి వాసిరెడ్డి , శిరీష కట్ట , వెంకట్ రావు , సౌజన్ రావు, శివా రెడ్డి , సాయి వేముల , రాజ్నామ, సాయి కిరణ్ నల్ల , వూరే వంశీ , సందీప్ రెడ్డి , రమణ అంతటి , నిర్మల్ నాని , సుధీర్ బోనం, రాజు కుప్పు, రంజిత్ కుమార్ ,లక్ష్మణ్ వెన్నపురెడ్డి , ఉమా మహేశ్వర్, మురళి బండారు , కాశీ చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.