NRI news | హ్యాట్రిక్ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్కు 100 సీట్లు ఖాయం
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తెలంగాణ (Telangana) అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఖచ్చితంగా 100 సీట్లు గెలవడం ఖాయమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ (BRS NRI Kuwait) అధ్యక్షురాలు అభిలాష గొడిశాల (Abhilasha Godishala) అన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తెలంగాణ (Telangana) అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఖచ్చితంగా 100 సీట్లు గెలవడం ఖాయమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ (BRS NRI Kuwait) అధ్యక్షురాలు అభిలాష గొడిశాల (Abhilasha Godishala) అన్నారు. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థులను ప్రకటించడంతోపాటు బీఆర్ఎస్ మానిఫెస్టోని కూడా ప్రజల ముందుంచి ప్రచారంలో రేసుగుర్రంలా దూసుకుపోతున్నారని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్నాయని ఎద్దేవాచేశారు. అలాగే అర్హత ఉన్న అభ్యర్థులు కూడా ఢిల్లీ గులాంలా ఆదేశాలకోసం వేచి చూస్తున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని, దేశానికే ఆదర్శమన్నారు. ఈ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావడం పక్కా అని చెప్పారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం సరికొత్త పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని, సీఎం కేసీఆర్ పథకాల వల్ల తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కువైట్ నుంచి సోషల్ మీడియా, కాల్ క్యాంపెయిన్ ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

