Mahesh Bigala | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల (Mahesh Bigala) సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా సేవలందించిన మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. ఆయన మరణం పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటని చెప్పారు. ఆయన ప్రజలతో నిబద్ధతతో కూడిన రాజకీయం చేశారన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వెల్లడించారు. ఆయన మానవీయత, వినయం, ప్రజలతో సాన్నిహిత్యం ఆయనకు ఎంతో ఆదరణ తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ప్రవాస భారతీయుల తరపున ఆయన కుటుంబానికి, బంధువులకు, అభిమానులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని వెల్లడించారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరారు.