సింగపూర్లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
Bonalu Festival | సింగపూర్లో తెలంగాణ కల్చరల్ సొసైటీ(టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న సుంగే కేడుట్లోని శ్రీ అరస కేసరి శివన్ ఆలయంలో భక్తులు బోనాల వేడుకలను నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరికీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, కరోనా నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించాలని తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. బోనాల ఊరేగింపులో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఊరేగింపులో బోనాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తెలంగాణ బోనాల పండుగను ఆరేండ్ల క్రితమే సింగపూర్కు తెలంగాణ కల్చరల్ సొసైటీ పరిచయం చేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందజేయడంలో టీసీఎస్ఎస్ ముందు వరుసలో ఉంటుందన్నారు.
ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో బండ శ్రీదేవి మాధవ రెడ్డి, గోనె రజిత నరేందర్ రెడ్డి, గడప స్వాతి రమేశ్, మద్దుకుంట్ల స్వరూప రాజు, గదంశెట్టి స్వరూప్, దార అలేఖ్య ఉన్నారు. వీరితో పాటు ఫణి రోజా రమణి అమ్మవారి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకొచ్చారు. ఈ వేడుకలకు సమన్వయకర్తలుగా నంగునూరి సౌజన్య, గర్రెపల్లి కస్తూరి, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు వ్యవహరించారు.
అదే విధంగా సంబరాలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకారం అందించిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి కల్వ లక్ష్మణ్రాజులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మై హోమ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, రోజా రమణి, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, శ్రీధర్ కొల్లూరి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, కాసర్ల శ్రీనివాస్, పెరుకు శివ రామ్ ప్రసాద్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్, ప్రవీణ్ మామిడాలతో తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

