ఆస్ట్రేలియా : తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని రాక్బ్యాంక్ దుర్గా మాత ఆలయంలో మెల్బోర్న్ తెలంగాణ న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మ వారికి బోనాలు, తొట్టెల సమర్పించి మొక్కును చెల్లించుకున్నారు.
పోతురాజుల ఆట, పాటలు, యువకుల నృత్యాలతో దుర్గామాత ఆలయంలో సందడి చేసారు. బోనాల పాటలకు చేసిన నృత్యాలకు భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా నాట్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్న ఈ వేడుకలను అదే స్థాయిలో గత 7 సంవత్సరాలు గ నిర్వహిస్తున్న మెల్బోర్న్ తెలంగాణ న్యూస్ సంస్థ నిర్వాహకులు తెలంగాణ మధు, రాజు వేముల, ప్రజీత్ రెడ్డి కోతి, దీపక్ గద్దెలను ఈ వేడుకలకు హాజరైన వివిధ సంఘాల నాయకులు, ప్రజలు అభినందించారు.