Kuwait Fire Accident : కువైట్‌లో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 42 మంది భారతీయులు మరణించిన ఘటన కలకలం రేపింది. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కువైట్ చేరుకున్నారు.
అగ్నిప్రమాదంలో దగ్ధమైన మృతదేహాలు గుర్తించేందుకు వీల్లేకుండా ఉన్నాయని, బాధితులను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి కీర్తివర్దన్ సింగ్ తెలిపారు. మృతదేహాలను భారత్ తీసుకొచ్చేందుకు ఐఏఎఫ్ విమానం సిద్ధంగా ఉందని వెల్లడించారు. మృతదేహాలను గుర్తించిన వెంటనే వారి బంధువులకు అప్పగిస్తామని స్వదేశానికి ఐఏఎఫ్ విమానంలో తరలిస్తామని పేర్కొన్నారు.
ఇక కువైట్‌లోని భారతీయ అధికారులు హెల్ప్‌లైన్ నంబర్ +965-65505246 ఏర్పాటుచేశారు. కువైట్‌లోని మంగాస్ జిల్లాలో బుధవాంర తెల్లవారుజామున సంభవించిన ఈ భారీ అగ్నిప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 40 మందికి పైగా భారతీయ కార్మికులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. అగ్నిప్రమాదం కారణంగా భవనంలో నిద్రిస్తున్న వారు పొగ పీల్చడంతో అత్యధిక మరణాలు సంభవించాయని అధికారులు చెబుతున్నారు.