KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కువైట్ తదితర దేశాల్లోనూ బీఆర్ఎస్ ఎన్నారై సభ్యులు బర్త్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అమెరికాలో ఎన్నారై శాఖ సభ్యులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. పలు రాష్ట్రాల్లో కేక్ కట్ చేసి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించారు.
ఇక ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్లోనూ ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు.
Kcr Birthday2
Kcr Birthday3
Kcr Birthday5