తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
TPAD | తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(TPAD) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఎనిమిదేండ్లలో ఈ బ్లడ్ డోనేషన్ క్యాంపు నిర్వహించడం ఇది పదోసారి. ఇక
హైదరాబాద్ : తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(TPAD) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఎనిమిదేండ్లలో ఈ బ్లడ్ డోనేషన్ క్యాంపు నిర్వహించడం ఇది పదోసారి. ఇక కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత సంవత్సరానికి రెండు సార్లు బ్లడ్ డోనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. తాజాగా నిర్వహించిన బ్లడ్ క్యాంపులో 69 మంది రక్తదానం చేశారు. 52 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. రక్తాన్ని కార్టర్ బ్లడ్ కేర్కు అందించినట్లు పేర్కొన్నారు.

తాజాగా సేకరించిన 52 యూనిట్ల రక్తంతో దాదాపు 10 మందికి గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు లేదా, 17 మందికి రక్త మార్పిడి చేయడానికి సరిపోతుందన్నారు. రక్తదానం చేసిన వారికి భోజన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా వారిని అభినందించి బ్లాంకెట్లను బహుమతిగా అందజేశారు.

రక్తదాన శిభిరం విజయవంతం కావడానికి సహకరించిన రఘువీర బండారు, ఉమా బండారుతోపాటు వలంటీర్లకు, కార్టర్ బ్లడ్ కేర్ టెక్నీషియన్లకు ఈ సందర్భంగా నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రి గిరి, చక్రీ నారా, అజయ్ రెడ్డి(ఎఫ్సీ చైర్), రమణ లష్కర్(ప్రెసిడెంట్), ఇంద్రాని పంచెరుపుల(బీఓటీ), పాండు పాల్వే(కోఆర్డినేటర్) తదితర సభ్యులు పాల్గొన్నారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

