జర్మనీ : జర్మనీలోని మునిచ్ నగరంలో తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ కన్నుల పండుగలా జరిగింది. ఈ వేడుకల్లో 200 లకు పైగా ఎన్నారై మహిళలు పాల్గొన్నారు . బతుకమ్మ ఆటపాటలతో అక్కడి పరిసరాలు మార్మోగాయి. ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాల, కోలాట పాటలు పాడారు.
తెలంగాణలో జరుపుకున్న విధంగానే జర్మనీలోను బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో స్థిరపడిన తెలంగాణ, తెలుగు వాసులు కూడా బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులు అరవింద్, నరేష్, శ్రీనివాస్, వికాస్, సుజిత్, మహేష్, దేవేందర్, శివ, గిరీష్, రమేష్, అనిల్ అన్నారు.