TAUK-Bathukamma | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుండి మూడు వేల మందికి పైగా ఎన్నారై కుటుంబాల సభ్యులు హాజరయ్యారు. స్థానిక ఎంపీ, సీమ మల్హోత్రా (లేబర్ పార్టీ షాడో మినిస్టర్), స్థానిక హౌంస్లౌ మేయర్ ఆఫ్జల్ కియానీ, కౌన్సిలర్ ఆదేశ్ ఫార్మహాన్ ముఖ్య అథితులుగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ పలు కార్యక్రమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కేటీఆర్ కృషికి తమ వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాదీ వేడుకలను `చేనేత బతుకమ్మ-దసరా`గా జరుపుకున్నట్లు బీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు, టాక్ నేషనల్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.
తమ పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని, స్ఫూర్తినిచ్చిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి, స్వాతి బుడగం, క్రాంతి రేతినేని, జాహ్నవి దూసరి, శ్రావ్య వందనపు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
టాక్ ఉపాధ్యక్షుడు సత్య చిలుముల ఈ సందర్భంగా మాట్లాడుతూ దసరా పండుగ సందర్బంగా స్వదేశం నుండి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటుపై ఏర్పాటు చేసిన దసరా `అలాయ్- బలాయ్` కార్యక్రమంలో, పరస్పరం చేనేత శాలువాలతో సన్మానం, జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నట్లు తెలిపారు. చేనేతకు చేయూతగా వీలైనప్పుడల్లా చేనేత బట్టలు ధరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. జమ్మి ఆకులు పంచుతూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపారని పలువురు ప్రశంశించారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ- దసరా పండగ సందర్బంగా మహిళలంతా భక్తిశ్రద్ధలతో సంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపారు. బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లతో సందడిసందడిగా సాగింది. విదేశాల్లో స్థిరపడినా తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడంతోపాటు చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతోపాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
టాక్ చేపట్టిన అన్ని కార్యక్రమాలను ప్రోత్సహించి విజయవంతం చేస్తున్న ప్రవాసులందరికి టాక్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, టాక్ ఈవెంట్స్ ఇంచార్జి మల్లా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం మాట్లాడుతూ తాము కోరినట్లు ఈ వేడుకలకు హాజరైన వారిలో చాలా మంది చేనేత వస్త్రాలు ధరించడం సంతోషంగా ఉందన్నారు.
టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు తమను వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ కవితకు టాక్ ప్రధాన కార్యదర్శి జాహ్నవి దూసరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తరువాతే మన పండగలకు, మన సంస్కృతికి సరైన గౌరవం గుర్తింపు లభించిందని తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చేనేతకు చేయూతగా చేస్తున్న వేడుకల్లో ఎంతో సామాజిక బాధ్యత ఉందని తెలిపారు. టాక్ కార్యదర్శులు రవి రేతినేని, సుప్రజ పులుసు, గణేష్ కుప్పాల మాట్లాడుతూ `మా వేడుకలకు హాజరైన ప్రవాస సంస్థల ప్రతినిధులకు, సహకరించిన స్పాన్సర్ సంస్థలకు, స్థానిక అధికారులకు కృతఙ్ఞతలు` అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రైమ్ స్పాన్సర్ అన్నపూర్ణ రైస్ యాజమాన్యం ప్రత్యేక బహుమతులు అందజేసినందుకు అశోక్ గౌడ్ దూసరి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తమ బతుకమ్మకు, బతుకమ్మ తెచ్చిన ఆడబిడ్డలకు బహుమతులను అందించారు.
ఈ కార్యక్రమంలో టాక్ నేషనల్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, సత్యమూర్తి చిలుమూల, ప్రధాన కార్యదర్శులు సురేష్ బుడగం, జాహ్నవి దుసరి, అడ్వైజరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, కమ్మూనిటీ, ముఖ్య సభ్యులు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల, మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి, గణేష్ కుప్పల, గణేష్ పాస్తం, రాకేష్ పటేల్, రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, మాధవ రెడ్డి ,సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, శ్రావ్య వందనపు, హరి గౌడ్ నవాబ్ పేట్, క్రాంతి రేటినేని, శ్వేత మహేందర్, శశి దొడ్లే, శ్రీ లక్ష్మి, ప్రశాంత్ మామిడాల, శ్రీకాంత్ ముదిరాజ్, తేజ, నిఖిల్, మౌనిక, ప్రవీణ్ వీర, శ్రీకాంత్ జెల్ల, శైలజ, శ్రీధర్ రావు, కార్తీక్, ప్రశాంత్ మామిడాల, మహేందర్, శ్రీవిద్య, స్నేహ, విజిత, సత్యం కంది, రంజిత్, వంశీ, నరేష్, నాగరాజు, మ్యాడి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.