శనివారం 06 మార్చి 2021
Nri-news - Jan 19, 2021 , 16:50:54

ఆటా ప్రెసిడెంట్‌గా భువ‌నేశ్ బుజాల బాధ్య‌త‌ల స్వీకర‌ణ‌

ఆటా ప్రెసిడెంట్‌గా భువ‌నేశ్ బుజాల బాధ్య‌త‌ల స్వీకర‌ణ‌

హైద‌రాబాద్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ( ఆటా) గా భువనేశ్ బుజాల పదవీ బాధ్యతలు స్వీకరించారు. వాషింగ్టన్ డీసీ నివాసి అయినా భువనేశ్ 2004 సంవత్సరం నుంచి ఆటాలో క్రీయాశీల‌కంగా ఉన్నారు. 2014 లో జరిగిన  ఫిలడెల్ఫియా కన్వెన్షన్లో కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. నాశ్విల్లే నగరంలో జనవరి 16న జరిగిన అటా కార్యవర్గ సమావేశంలో ప్రెసిడెంట్‌గా ఎన్నిక‌య్యారు. డిసెంబర్ మాసంలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఆటా బోర్డు అఫ్ ట్రస్టీస్ గా జయంత్ చల్ల, కాశీ విశ్వనాధ్  కొత్త, పరశురాం పిన్నపురెడ్డి, శారద సింగిరెడ్డి, సోమశేఖర్ నల్ల, తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, హను తిరుమల రెడ్డి, ప్రశీల్ గూకంటి, రఘువీర్ రెడ్డి, రామ్ అన్నాది, రవీందర్ గూడూరు, రిండా సామ, శరత్ వేముల, సుధీర్ బండారు, విజయభాస్కర్ తుపల్లి ఎన్నికయ్యారు. ఆటా ప్రెసిడెంట్‌గా భువనేశ్ బుజాల, సెక్రటరీగా హరిప్రసాద్ రెడ్డి లింగాల, ట్రేషరేర్‌గా సాయినాథ్ రెడ్డి బోయపల్లి, జాయింట్ సెక్రటరీగా రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్ ట్రేషరేర్‌గా విజయ్ కుందూరు ఎన్నికయ్యారు. నష్విల్లె నగరంలో జరిగిన ఆటా బోర్డు స‌మావేశంలో నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించింది. తదుపరి ప్రెసిడెంట్‌గా మధు బొమ్మినేని ఎన్నికయ్యారు.

ఈ సంద‌ర్భంగా భువనేశ్ బుజాల మాట్లాడుతూ.. ఆటా ఎమర్జెన్సీ సర్వీసెస్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ప్రతి రాష్ట్రానికి విస్తరిస్తున్న‌ట్లు తెలిపారు. ఆపదలో ఉన్న తెలుగువారు ATA సేవ 1-844-ATA-SEVA టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చెయాల్సిందిగా సూచించారు. ఆటా ఫౌండేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. అమెరికాలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి ఆటా ఎల్లప్పుడూ పెద్ద  పీఠవేస్తుందన్నారు. మన మాతృభూమిలో సేవ కార్యక్రమాలు నిర్వహించాలనుకునే ప్రవాసులు ఆటాను సంప్రదించవలసిందిగా కోరారు. సంస్థ నిర్వహణ కార్యక్రమంలో అమెరికాలో పుట్టి పెరిగిన మన పిల్లలను బాగస్వాములు చెయ్యటానికి తగు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా బోర్డుని కోరారు. యూత్  కమిటీ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. మొట్ట మొదటసారిగా ఆటా కన్వెన్షన్ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో 2022 సంవత్సరంలో జులై 1-3 తేదీల్లో నిర్వహిస్తున్నామని అందరూ తప్పక పాలు పంచుకోవాల్సిందిగా పేర్కొన్నారు. 

కొవిడ్ సమయంలో సహాయక చర్యలు, సంస్థ బాధ్యతలు ఎంతో సమర్ధవంతంగా నిర్వహించి పదవీ విరమణ చేసిన పరమేష్ భీంరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించిన రవి పట్లోళ్ల గారికి, ప్రీవియస్ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి గారిని బోర్డు అభినంధించింది. నాశ్విల్లే నగరంలో ఆతిధ్యం ఇచ్చిన ఆటా సబ్యులకు పేరు పేరున భువ‌నేశ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

VIDEOS

logo