South Central Railway Recruitment 2023 | సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ విభాగాలలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అకడమిక్ మార్కులు, పని అనుభవం, పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 35
పోస్టులు : జూనియర్ టెక్నికల్ అసోసియేట్
విభాగాలు : సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ & సిగ్నల్ టెలికమ్యూనికేషన్
అర్హతలు : డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : అకడమిక్ మార్కులు, పని అనుభవం, పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ ద్వారా
వయస్సు : 18-33 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను సెక్రటరీ టు ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అండ్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్), ఆఫీస్ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, 4వ అంతస్తు, పర్సనల్ డిపార్ట్మెంట్, రైల్ నిలయం, ఎస్సీఆర్, సికింద్రాబాద్ అడ్రస్‌కు పంపాలి.
చివరి తేదీ: జూన్ 30
వెబ్సైట్ : https://scr.indianrailways.gov.in/