NIRDPR Recruitment 2023 | అకడమిక్ అసోసియేట్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRD&PR) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 06
పోస్టులు : అకడమిక్ అసోసియేట్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్
అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 45 ఏండ్లు
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.300(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు).
చివరి తేదీ: ఏప్రిల్ 10
వెబ్సైట్ : http://nirdpr.org.in/