హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్ట్రిక్ట్ కార్పొరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీ) లిమిటెడ్ స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 3 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 75
ఇందులో ఓపెన్ 59, ప్యాక్స్ 16 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. 18 నుంచి 30 ఏండ్ల వయస్సులోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
పరీక్ష విధానం: రాతపరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షను 60 నిమిషాల్లో పూర్తిచేయాల్సి వస్తుంది. ఇంటర్వ్యూకి 12.50 మార్కులు కేటాయించారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.590, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీలకు రూ.413
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 3
వెబ్సైట్: kadapadccb.in