ESICలో 4315 యూడీసీ, ఎంటీఎస్ పోస్టులు
ESIC | ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చేనెల 15 నాటికి

న్యూఢిల్లీ: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చేనెల 15 నాటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మొత్తం 4315 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), స్టెనోగ్రాఫర్ (Steno), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు ఉన్నాయి. తెలంగాణ (72), ఆంధ్రప్రదేశ్ (35)తోపాటు కోల్కతా, డెహ్రాడూన్, కాన్పూర్, ఢిల్లీ, జైపూర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, ఫరీదాబాద్తోపాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 4315
ఇందులో యూడీసీ 1726, స్టెనో 163, ఎంటీఎస్ 1931 చొప్పున ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్లో యూడీసీ 25, స్టెనో 4, ఎంటీఎస్ 43, విజయవాడలో యూడీసీ 7, స్టెనో 2, ఎంటీఎస్ 26 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ, ఇంటర్, పదో తరగతి పాసై, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 27 ఏండ్ల వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.250
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 15
వెబ్సైట్: www.esic.nic.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
- Tags
- ESIC
- MTS
- Recruitment
- Stenographer
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

