ESI Sangareddy Recruitment | సంగారెడ్డి జిల్లాలోని ఈఎస్ఐ హాస్పిటల్ ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ఫార్మాసిస్ట్ తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్, డీఫార్మసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ఏప్రిల్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 16
పోస్టులు : సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ఫార్మాసిస్ట్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్, డీఫార్మసీ ఉత్తీర్ణత
జీతం : నెలకు సీఏఎస్, డీఏఎస్ రూ.58,850, ఫార్మాసిస్ట్ పోస్టులకు రూ.31,040.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, 5వ అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్, సనత్‌నగర్, నాచారం, హైదరాబాద్ అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 13