CRPF Recruitment 2023 | నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్ విభాగాలలో, సబ్-ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ తదితర పోస్టుల భర్తీకి డైరెక్టరేట్ జనరల్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(Central Reserve Police Force) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 212
పోస్టులు : సబ్-ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయస్సు : ఎస్సై పోస్టులకు 30 ఏండ్లు, ఏఎస్సై పోస్టులకు 18 నుంచి 25 ఏండ్లలోపు ఉండాలి.
జీతం: రూ.29,200 నుంచి రూ.1,12,400 వరకు
దరఖాస్తు ఫీజు : ఎస్సై పోస్టులకు రూ.200, ఏఎస్సై పోస్టులకు రూ.100 ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు.
ఎంపిక : రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్.
దరఖాస్తులు ప్రారంభం: మే 01
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: 21/05/2023. మే 21
అడ్మిట్ కార్డ్ విడుదల :జూన్ 13
వెబ్సైట్ : rect.crpf.gov.in