Canara Bank Recruitment | బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కెనరా బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. బ్యాంకు తాజాగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీని ప్రారంభించింది. ఈ క్రమంలో నోటిఫికేసన్ జారీ చేసింది. బ్యాంకుల్లో ఉద్యోగాలు చేయాలని ఆశిస్తున్న వారికి ఇది నిజంగా గొప్ప అవకాశమే. ఆసక్తి ఉన్న అభ్యర్థులు canarabank.com అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. స్పెషల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ ఈ నెల 6న మొదలైంది. దరఖాస్తు చివరి తేదీ జనవరి 24తో ముగియనున్నది. దరఖాస్తుకు మరో ఐదురోజులు మాత్రమే గడువు ఉన్నది.
డేటా అనలిస్ట్, డేటా మైనింగ్ ఎక్స్పర్ట్, డేటా సైంటిస్ట్, అప్లికేషన్ డెవలపర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీసర్ ఐటీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఐటీలో గ్రాడ్యుయేట్, BE / B.Tech కలిగి ఉండాలి. గతంలో పని చేసిన అనుభవం కూడా ఉండాలి. అర్హతలకు సంబంధించిన మరింత సమాచారం అధికారిక నోటిఫికేషన్లో పొందుపరిచింది. అయితే, దరఖాస్తుదారులు గరిష్ఠ వయోపరమితి డిసెంబర్ 1, 2024 నాటికి 35 సంవత్సరాలుగా నిర్ణయించింది. రిజర్వ్డ్ కేటగిరిలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
స్పెషల్ ఆఫీసర్ పోస్టుల నియామకంలో రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్షలో ప్రొఫెషనల్ నాలెడ్జ్‌తో పాటు లోకల్ రీజనింగ్‌పై వంద ప్రశ్నలుఉంటాయి. మొత్తం వంద మార్కుల పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుంది. నెగెటివ్ మార్కులు సైతం ఉంటాయి. ఒక్క తప్పుకు 0.25 నెగెటివ్ మార్కు ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కెనరా బ్యాంక్ తెలిపింది. రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తు చేయవచ్చని పేర్కొంది.
స్పెషల్ ఆఫీసర్లుగా ఎంపికైన వారికి ఏడాదికి రూ.18లక్షల నుంచి రూ.27లక్షల వరకు ఉటుందింది. అంటే నెలకు రూ.1.50లక్షల నుంచి రూ.2.25లక్షల వరకు వస్తుంది. అభ్యర్థి అర్హత, అనుభవం, ప్రస్తుత ప్యాకేజీపై వేతనం ఆధారపడి ఉంటుంది. నియామక ప్రక్రియ, పోస్టులకు సంబంధించిన వివరాల కోసం కెనరా బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో సంప్రదించాలని కోరింది.