Railway jobs | పరీక్ష లేని బంపర్ రిక్రూట్మెంట్ను రైల్వే శాఖ చేపడుతున్నది. పదో తరగతి పాసైన వారికి భారతీయ రైల్వే శాఖ సువర్ణ అవాకాశం కల్పిస్తున్నది. వివిధ విభాగాల్లో పనిచేసేందుకు చేపడుతున్న డైరెక్ట్ రిక్రూట్మెంట్కు దరఖాస్తులను ఈ నెల 31 లో అందజేయాలని సూచించింది.
రైళ్లలో ఉద్యోగం చేయాలనుకునే యువత కసం గొప్ప అవకాశం కల్పిస్తున్నది ఇండియన్ రైల్వేస్. 6265 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సదరన్ రైల్వేలో 3150 అప్రెంటీస్ పోస్టులు, తూర్పు రైల్వేలో 3115 పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. 24 ఏండ్లలోపు వయసు ఉండి 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్సైట్ secr.indianrailways.gov.in ను సందర్శించి ఈ నెల 31 లోగా ఆన్లైన్లో దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది. ఈ బంపర్ రిక్రూట్మెంట్లో అభ్యర్థులను ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా ఎంపిక చేస్తారు.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఏదేని గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కోర్సులో పాసై ఉండాలి. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 2022 మే 1 నాటికి కనిష్ట వయస్సు 15, గరిష్ట వయోపరిమితి 24 సంవత్సరాలుగా ఉండాలి. రిజర్వుడ్ క్యాటగెరీలకు సడలింపు ఉంటుంది.
మెట్రిక్యులేషన్, ఐటీఐ కోర్సుల్లో సాధించిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేసి ఉద్యోగాలిస్తారు.