e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News రైల్వేలో 520 గూడ్స్‌గార్డ్‌ పోస్టులు

రైల్వేలో 520 గూడ్స్‌గార్డ్‌ పోస్టులు

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలో భాగమైన సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో ఖాళీగా ఉన్న గూడ్స్‌గార్డ్‌ (Goods guard)పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 23 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 520 పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు కోల్‌కతా కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 520
ఇందులో జనరల్‌ 277, ఓబీసీ 87, ఎస్సీ 126, ఎస్టీ 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై 42 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష ద్వారా. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌, అరిథ్‌మెటిక్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోతవిధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 23
వెబ్‌సైట్‌: https://www.rrcser.co.in

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement