Y oga | పోతంగల్ జూన్ 21: ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో యోగాను దిన చర్యలో భాగం చేసుకోవాలని, యోగా శరీరం, మనసు, ఆత్మను ఏకం చేసే అద్భుతమైన సాధనమని ఆయుష్ డాక్టర్ రాధిక అన్నారు. మండల కేంద్రంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని రైతు వేదిక, జిల్లా పరిషత్ ఉర్దూ, తెలుగు పాఠశాల, బాలాజీ మందిర్ ఆలయ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
యోగా సాధకులు సతీష్ గౌడ్, జ్యోతి విద్యార్థులు, స్థానికులతో యోగాసనాలు చేయించారు. విద్యార్థులు నిర్వహించిన యోగా విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ ప్రతీరోజూ యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారనీ, ప్రతీ ఒక్కరూ వారీ జీవన శైలిని మార్చుకొని, ప్రతీ రోజు కొంత సమయం యోగాకు కేటాయించాలని సూచించారు. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం వృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.