కోటగిరి, జూన్17 : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్కు బారీ కేడ్లు అందజేయడం మంచి పరిణామని మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలోని యశశ్రీ హై స్కూల్ నిర్వాహకులు రెండు బారీకేట్లు అందజేశారు. స్వచ్ఛందంగా ఇలాంటి సేవా కార్యక్రమం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్, యశశ్రీ హై స్కూల్ నిర్వాహకులు పి అనిల్ కుమార్, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కూచి సిద్దు, వైస్ చైర్మన్ బొట్టే గజేందర్, బీర్కూర్ శ్యాం కుమార్, కప్ప సంతోష్, ప్రభాకర్ తదితరులున్నారు.