ఆకాశమే హద్దుగా..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు కొనసాగుతున్న ఈవెంట్స్‌లో భాగంగా మూడో రోజు శనివారం కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే నిర్వహించారు.
- పోలీసు ఈవెంట్స్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళా అభ్యర్థులు
- మూడో రోజు మహిళా అభ్యర్థులకు ఈవెంట్స్
- 1000 మందికి గాను 879 మంది హాజరు
- శారీరక దారుఢ్య పరీక్షల్లో 640 మంది ఎంపిక
- పర్యవేక్షించి సీపీ నాగరాజు
నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 10 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు కొనసాగుతున్న ఈవెంట్స్‌లో భాగంగా మూడో రోజు శనివారం కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే నిర్వహించారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పరీక్షలను పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు పర్యవేక్షణలో సాయం త్రం వరకు నిర్వహించారు. వెయ్యి మంది అభ్యర్థులను పిలువగా 879 మంది అభ్యర్థు లు హాజరయ్యారు.
ఉదయం నుంచి అభ్యర్థు ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, బయోమెట్రిక్‌తో పా టు 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించి అర్హత సాధించిన వారికి ఈవెంట్స్ నిర్వహించారు. పరుగుపందెం, ఎత్తు కొలత, షాట్‌ఫుట్, లాంగ్‌జంప్ ఈవెంట్స్‌లో 640 మంది అభ్యర్థులు ఎంపికైనట్లుగా వెల్లడించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. తాగునీటిని సదుపాయం, మెడికల్ టీమ్స్, అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ శారీరదారుఢ్య పరీక్షలు ఈ నెల 22వ తేదీ వర కు కొనసాగుతాయని వెల్లడించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, అదనపు డీ సీపీ గిరిరాజు, నిజామాబాద్, ఆర్మూర్, బోధ న్, సీసీఎస్, హోమ్గార్డ్స్, ట్రాఫిక్, సీటీసీ ఏసీపీలు ఏ.వెంకటేశ్వర్, ఆర్.ప్రభాకర్ రావు, కె. ఎం.కిరణ్ కుమార్, రమేశ్, శ్రీనివాస్, నారాయణ, శ్రావణ్ కుమార్, ఏఆర్ ఏసీపీ సంతో ష్, కామారెడ్డి ఏఆర్ డీఎస్పీ ఉదయ్ కృష్ణ, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులుతో పాటు పోలీస్ వెల్ఫేర్ దవాఖాన డాక్టర్ సరళ, ఫిజికల్ డైరెక్టర్స్, పీఈటీలు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

